నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న బీఈడీ కాలేజీలో గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను అకాడమిక్ ఇయర్ వారి యొక్క పర్ఫార్మెన్స్ పరిశీలించి వారిని కొనసాగించడానికి డెమో ద్వారా వారి యొక్క బోధనను పరిశీలించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. శుక్రవారం నాడు ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలులో బిఈడి కళాశాలలో పనిచేయుచున్న గెస్ట్, కాంట్రాక్టు లెక్చరర్ల డెమోను కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన పరిశీలించారు. బీఈడీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం లెక్చరర్లు విద్యార్థులకు వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన ఏ విధముగా విద్యార్థులకు బోధిస్తున్నది పరిశీలించడానికి సబ్జెక్టుల వారిగా ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క డేమోను పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, డీఈవో వెంకటేశ్వర చారి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, ఏసీఎంవో రమణయ్య ,ఏటిడబ్ల్యూ నరసింహారావు పాల్గొన్నారు.