★ అమరవీరుల సాక్షిగా శాసనసభ స్పీకర్ కు రాజీనామా లేఖను పంపించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతందానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాల్ కి అంగీకరించిన ఆయన శుక్రవారం హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కి ప్రతి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతులకు ప్రజలకు మేలు జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నానని.. అప్పటివరకు ప్రజల హామీలు నెరవేస్తే తను రాజీనామా చేసినట్టేనని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ కు హామీలు అమలు అయితే తన రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లేఖను పంపించారు.
★మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే★👇
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట ప్రతి నెలకు 18 యేండ్లు దాటిన వారందరికీ రూ. 2500 చొప్పున ఇస్తామన్న హామీ నేర వేర లేదు రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ 15 పదిహేను వేల రూపాయల చొప్పున ,రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల చొప్పున చెల్లించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించడమనే హామీలు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు యువ వికాసం కింది 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.