— ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్న నిరుద్యోగులు
— పట్టభద్రులకు ఉపాధి కల్పనకై నిరంతరం కృషి చేస్తా.. ఒక్క అవకాశం ఇవ్వండి
— వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో బరిలో ★సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ప్రకటించారు. గత 14-03-2021 లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో 73 మంది పోటీ చేయగా, అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 8 స్థానంలో నిలిచిన తనకు ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు కోసం కొట్లాడి తెంచుకున్న తెలంగాణ లో ఈరోజు వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయలేదన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్లు లక్షల సంఖ్యలో డిగ్రీ చదువుకొని సరైన ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో కార్పోరేట్ విద్యాసంస్థల అదినేత పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్ర ఎన్నికల్లో గెలిపిస్తే పట్టభద్రుల తరపున ప్రశ్నించింది ఏమీ లేదన్నారు. కార్పోరేట్ సంస్థలు అధినేతలు వారి సంస్థల ఆస్తులు కాపాడడం కోసం పనిచేసారె తప్ప నిరుద్యోగుల తరఫున శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా ఆలోచించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు మీయొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే శాసనమండలిలో నిరుద్యోగుల తరఫున కొట్లాడడానికి నిరుద్యోగుల తరఫున ప్రశ్నించడానికి, నిధులు నియమకాల కోసం నిరంతరం కృషి చేస్తానని, నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరి తరపున నిరుద్యోగుల గొంతు శాసనమండలిలో వినిపిస్తానని స్పష్టం చేసారు.
