నేటి గద్ధర్ న్యూస్ ,పినపాక :
ఈనెల 30వ తేదిన జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మాజీ ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ బస్సుయాత్రను జయప్రదం చేయాలని BRS పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి కోరారు. ఆదివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని BRS పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
ఈ నెల 30వ తేదిన జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో సాయంత్రం 6 గంటలకు బస్సుయాత్ర జరుగుతుందని దానిని పినపాక మండల పరిధిలోని BRS పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు, యువకులు, మహిళలు, కార్మికులతో పాటు అన్ని రంగాల ప్రజలు పాల్గొని బస్సుయాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో BRS పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్, పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, సీనియర్ నాయకులు రాయల బాబు, చింతపాటి సత్యం, బత్తుల వెంకటరెడ్డి, షేక్ జాంగీర్, పొనుగోటి కామేష్, కొండేరు రాము, ముక్కు నాసర్ రెడ్డి, గాండ్ల అశోక్, కంది సుధాకర్ రెడ్డి, కంది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.