నేటి గద్ధర్ న్యూస్ ,పినపాక: ఏడూళ్ల బయ్యారం రేంజ్ పరిధి. గోపాలరావు పేట బీట్ తోగ్గూడెం గ్రామానికి సమీపంలో ఉన్న పెద్దవాగు పొట్లపల్లి గుట్ట నుండి ఊర కుక్కలు ఆదివారం రాత్రి దుప్పిని తరుముకుంటు రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ దుప్పి తన ప్రాణాలు కాపాడు కోవడానికి తోగ్గూడెం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొడ్డు సరోజిని ఇంట్లో కి చొరబడింది.తన ఇంటి ఆవరణలో అలకిడిని గమనించిన సరోజిని బయటకు వచ్చి గమనించగా అప్పటికే దుప్పి కుక్కల దాడి మూలంగా తీవ్ర గాయాల పాలై ఉంది. కొద్ది సమయం అనంతరం దుప్పి మృతి చెందినట్లుఆమె తెలిపారు. కాగా దుప్పి పై కుక్కలు జరిగిన దాడి సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపినట్లు సరోజినీ తెలిపారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు
Post Views: 609