★*మహబూబాబాద్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
★కరకగూడెం మండల జనరల్ బాడీ సమావేశానికి హాజరైన Mla పాయం.వెంకటేశ్వర్లు
★పాల్గొన్న మిత్ర పక్ష పార్టీ ల నాయకులు
నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం:మహబూబాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని పినపాక Mla పాయం.వెంకటేశ్వర్లు అన్నారు. అయన బుధవారం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమవేశం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అదితిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నేల 13 వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి పోరిక.బలరాం నాయక్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించి మహబూబాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అశా భావం వ్యక్తం చేశారు. అలాగె రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి కావడం కాయం అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 5 గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,మిత్రపక్షాల నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
