+91 95819 05907

ఘనంగా మేడే వేడుకలు

*సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు*
*మే డే సభలో సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు*
నేటి గద్దర్ కరకగూడెం: కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అనగారిన శ్రామిక వర్గం పక్షాన నికరంగా పోరాటం నిర్వహించేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు పేర్కొన్నారు. మే డే సందర్భంగా మండలంలోనీ పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసి సభలు సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా ఆవిర్భావమే అమరవీరుల రక్తతర్పణతో జరిగిందని హక్కుల కోసం జరిగిన పోరాటంలో త్యాగానికి సమస్యల పోరాటాలకు మేడే సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు పాలక పార్టీలు ఓట్లు సీట్లు కోసం తప్ప సమాజ మార్పు కోసం పనిచేయడం లేదని దోపిడీ నిర్మూలన సమానత్వం ఎర్రజెండా రాజ్యంలోనే సాధ్యమని పేర్కొన్నారు కమ్యూనిస్టులు సిపిఎం బలంగా ఉన్ననాడు దేశవ్యాప్తంగా ప్రజా అనుకూల చట్టాలు తయారు చేయబడ్డాయని అటువంటి చట్టాలకి నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో అసమానతలు లేని ప్రగతిని సాధించాలంటే సిపిఎం చెబుతున్న ఆర్థిక విధానాల అమలు తప్ప మరొక మార్గం లేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఇచ్చేటువంటి రాయితీలను సైతం ప్రభుత్వాలు రోజురోజుకీ రద్దు చేస్తున్నాయని విమర్శించారు కులం మతం ప్రాంతీయ అసమానతలు ఆర్థిక అసమానతలు లేని మంచి సమాజం కోసం విద్యా ఉపాధి మెరుగైన వైద్యం పంటలకు గిట్టుబాటు ధరలు కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కనీస వేతనాలు అమలు చేయగలిగే సిద్ధాంతం నిబద్ధత కలిగింది సిపిఎం పార్టీ మాత్రమేనని అన్నారు. నేడు రాజకీయాల్లో డబ్బు మతం కులం విచ్చనక అంశాలను ఉపయోగించి బూర్జువా పార్టీలు అధికారాన్ని అనుభవిస్తున్నాయని వారికి అధికారం అనేటువంటిది కొద్ది మంది సంపన్నులకు దేశ సంపద దోచి పెట్టడానికి ఉపయోగపడుతుందని సిపిఎం పేర్కొన్నది సిపిఎం పార్టీని కార్మిక ప్రజా పోరాటాలను బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వివిధ గ్రామాల్లో జరిగిన మేడే జెండా ఆవిష్కరణలు పార్టీ మండల కమిటీ సభ్యులు , సర్ప సత్యం బిలపాటి శంకరయ్య కనితి రాము అడమయ్య సిఐటియు నాయకులు ఇల్లందుల పిచ్చయ్య గాంధర్ల ధనంజయ్ ఉప్పల సాంబశివరావు ప్రశాంత్ సాంబశివరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం కలెక్టరేట్ లోని

Read More »

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు.. * మంత్రి తుమ్మల కృషితో రూ.249 మంజూరు * రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ నిర్మాణం మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం *

Read More »

కిలారు మనోహర్ కు సన్మానం.

కిలారు మనోహర్ కు సన్మానం. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: మండల కేంద్రం చింతకాని నూతన సర్పంచిగా ఎన్నికైన కిలారుమనోహర్ విజయోత్సవ సభలో పలువురు కిలారు మనోహర్ ను సన్మానించారు. కార్యక్రమంలో దిశ

Read More »

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు ★★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు ★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు నేటి గదర్:దంతాలపల్లి

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

 Don't Miss this News !