+91 95819 05907

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని హృదయంలో భద్రపరచుకున్న వ్యక్తి కెసిఆర్

మాజీ సీఎం KCR ని మర్యాద పూర్వకంగా కలిసిన కూనవరం మాజీ సర్పంచ్, ఎంపీటీసీ
★ సోషల్ మీడియాలో దొర దొర అంటూ అసత్య ప్రచారం చేశారు
★ కెసిఆర్ సార్ మృదుస్వభావి
★ KCR ని కలవడం మా పూర్వజన్మ సుకృతం
★ ఈ అవకాశం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు
★నేటి గద్ధర్ న్యూస్ తో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు, కూనవరం మాజీ ఎంపీటీసీ ఏనిక ప్రసాద్ ,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ

నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి: తెలంగాణ మహాత్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు శ్రామికుని వలె నిరంతరం కష్టపడిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,BRS పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రాన్ని తన గుండెలో భద్రపరచుకున్న గొప్ప వ్యక్తి కేసిఆర్ ను బుధవారం కొత్తగూడెంలో మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ఏనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ లు కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు నేటి గద్దర్ న్యూస్ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ఇంచు అభివృద్ధి చెందాలని తపన, సాధించిన ఫలాలు తెలంగాణ ప్రజలకి దక్కాలని ఆకాంక్ష కెసిఆర్ లో స్పష్టంగా దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం పని కట్టుకొని స్వార్థపూరితంగా దొర అని … కెసిఆర్ దొరల పాలన చేస్తున్నాడని విష ప్రచారం చేసి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తప్పు దోవ పట్టించారని ఆవేదన వెలుబుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మృదుస్వభావి అని ఈ అంశాన్ని దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ ప్రజానీకం దూరం చేసుకుని కొన్ని నెలలకే కష్టాల పాలయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. ప్రతిక్షణం కెసిఆర్ సార్ తెలంగాణ అభివృద్ధి కొరకే తపిస్తున్నారని వారు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా సభ్యులు కృషి చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. తెలంగాణ మహాత్మ కేసిఆర్ ని కలిసే భాగ్యం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !