తాగునీటి సమస్య లేకుండా చూడండి.
*సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి*
*మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రేగా కాళిక*
*పంచాయతీరాజ్ ఏ ఈ వెంకటేశ్వర్లు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ,ఎంపీడిఓ,తహశీల్దారు*
నేటి గద్దర్ కరకగూడెం: తాగునీటి సమస్య లేకుండా చూడాలని,ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక అన్నారు.గురువారం కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యకలాపాలను సభ్యులకు వివరించారు, పంచాయతీరాజ్ ఏ ఈ తమ పరిధిలో జరుగుతున్న సీసి రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనులను వివరిస్తూ ఉండగా, నాణ్యతగా నిర్మాణాలు జరగడంలేదని ఎంపీపీ రేగా కాళిక ఆగ్రహం వ్యక్తం చేశారు, గ్రామాలలో అంతర్గత నిర్మాణాలు జరిగేటప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలని లేని పక్షంలో గుత్తేదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని ఆమె అన్నారు. నాణ్యతగా లేదని మీరు ఎలా చెప్తారు క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెప్తారని ఏ ఈ వెంకటేశ్వర్లు చెప్పడంతో ఎంపీడీవో తాసిల్దార్ ఎంపీపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.రోజురోజుకు ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడంతో గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, వెంకటేశ్వర్లు,తహసిల్దార్, నాగ ప్రసాద్,మిషన్ భగీరథ డీఈ,వైస్ ఎంపీపీ శైలజ, ఎంపీటీసీ, మునీంద్ర,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.