+91 95819 05907

Adilabad:ఆ 75 మంది ఉద్యోగుల కు షో కాజ్ నోటీసులు

*రెండవ విడత ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 75 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు*

అదిలాబాద్ బ్యూరో:
రెండవ విడత ఎన్నికల శిక్షణలో భాగంగా ఇప్పటివరకు పీ ఓ, ఏ పీ ఓ లకు జరిగిన రెండు రోజుల శిక్షణకు మొత్తం 75 మంది ఉద్యోగులు గైరాజరైనందున, వారికి ఆర్ డి ఓ, సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారుల ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రెండవ విడత శిక్షణలో భాగంగా మే 1 న పి ఓ, ఏ పి ఓ లకు ముధోల్ నియోజకవర్గం లో ఐఐఐటీ బాసర లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి 25 మంది, నిర్మల్ నియోజకవర్గం లో సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఇద్దరు, ఖానాపూర్ నియోజకవర్గం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి 7 గురు చొప్పున మొత్తం 34 మంది గైరాజరైనారని, అదేవిధంగా మే రెండవ తేదీనాడు పీ ఓ, ఏ పీ ఓ లకు జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ముధోల్ నియోజకవర్గం లో 26 మంది, నిర్మల్ నియోజకవర్గంలో 8 మంది, ఖానాపూర్ నియోజకవర్గం లో 7గురు చొప్పున మొత్తం 41 మంది గైరాజరైనారని ఆయన తెలియజేశారు. షోకాజ్ నోటీసులు జారీ అయిన మొత్తం 75 మంది, ఇవ్వబడిన నోటీసులకు రేపు సరైన వివరణ ఇవ్వాలని, అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆయా నియోజక వర్గాల పరిధిలో వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో తప్పకుండా శిక్షణకు హాజరుకావాలని, లేనియెడల ఎన్నికల నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !