నేటి గద్ధర్ న్యూస్,అదిలాబాద్ బ్యూరో:
వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూ తగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురు నిందితులకి జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ గారు తీర్పు ఇచ్చారు. వాంకిడి సీఐ శ్రీనివాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం
తేది 21.06.2019 రోజున మద్యాహ్నం అందాజ 1200 గంటల సమయమున పాత భూతగాదాలను దృష్టి లో పెట్టుకొని నేరస్తులు అయిన 1). తోడాసం బోజ్జిరావు, 2). సేడ్మకే గంగారం, , 3). సేడ్మకే తెలంగ్ రావు 4). సేడ్మకే ఎశ్వంత్ రావు, 5). సేడ్మకే జంగు మరియు 6). తోడసం శారద, అను ఆరుగురు కలిసి ఒక పథకం ప్రకారము మారణ ఆయుధాలు (గొడ్డళ్ళు) చేతులలో పట్టుకొని, ఖిరిడి గ్రామ శివారులోని (మృతుడు) 1.రాయి సిడం శ్యాంరావు, తం: గంగు, వయస్సు: 52 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్లి, అతన్ని మరియు అతని భార్య అయిన (మృతురాలు) 2).రాయి సిడం తారాబాయి w/o. శ్యాంరావు, వయస్సు: 45 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి అనువారిని నిర్దాక్షిణ్యంగా గొడ్డళ్ళతో నరికి హత్య చేసినారు.
ఇట్టి విషయం పై మృతుల కుమారుడు అయిన రాయి సిడం విలాస్, పిర్యాదు ఇవ్వగా, వాంకిడి పోలిస్ స్టేషన్ నందు కేసు నం. 88/2019, U/Sec. 147, 148, 302 r/w 149 IPC గా నమోదు అయినాడు. ఇట్టి కేసులో అప్పటి వాంకిడి CI గారైన శ్రీ. రాణా ప్రతాప్ గారు విచారణ చేసి, ఆరుగురు నేరస్తులను రిమాండుకు తరలించినారు మరియు విచారణ పూర్తి అయిన తరువాత వారిపై గౌరవ న్యాయస్థానం లో చార్జ్ షీటు సమర్పించినారు. ప్రస్తుత వాంకిడి CI గారైన B. శ్రీనివాస్ గారు సాక్షులను, ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరచగా పిపి GVS ప్రసాద్ & జగన్మోహన్రావు గారు సాక్షులను విచారణ చేయగా నిందితులు నేరం చేసినట్టు రుజువైనది. కేసులోని నేరస్తులైన ఆరుగురి పైన నేరము రుజువు అయినందున గౌరవ జిల్లా సెషన్ జడ్జి గారు జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90 వేల రూపాయలను జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినారు.
కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత అసిఫాబాద్ డిఎస్పి సదయ్య , వాంకిడి సిఐ డి శ్రీనివాస్, ఎస్సై సాగర్ , కోర్టు అసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, పోషెట్టి మరియు కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.