+91 95819 05907

ఆ అంతరం అలాగే ఉండిపోయింది!*

✍️రణధీర్

*మధ్యతరగతి అంతరంగంలో..

*1)* చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు – తినడానికి , ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం.

కొంతమంది – రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, *అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!*

ఇప్పుడు పెద్దయ్యాక –
మనం కొనుక్కుని తినే టైంకి…..
ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.

*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*

*2)* చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే – కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు.
అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు …
*అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*

పెద్దయ్యాక –
మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే …..
వాళ్ళు – కాటన్ కు దిగారు. ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ !

*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*

⚖⚖⚖⚖⚖⚖⚖

*3)* చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే – మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే …మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!

పెద్దయ్యాక చూస్తే –
జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని…. ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !

*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది …*

⚖⚖⚖⚖⚖⚖⚖⚖

*4)* ఓ వయసులో మనకు – సైకిల్ కొనగలగడమే కష్టం.

అదీ సాధించేసరికి – వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు.

మనం – స్కూటర్ కొనే సమయానికి ….
వాళ్ళు కార్లలో తిరిగేవారు.

మనం కొంచెం ఎదిగి – మారుతి 800 కొనే సమయానికి ….
వాళ్ళు BMW ల్లో తిరిగారు.

మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో – కొంచెం పెద్ద కారు కోనేసమయానికి ….
వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!

*దాంతో ఇప్పటికి ఆ అంతరం అలాగే ఉండిపోయింది* . .

ప్రతి దశలో ,
ప్రతి సమయాన ,
విభిన్న మనుషుల మధ్య – స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.

*ఆ అంతరం – నిరంతరం* ఎప్పటికి ఉండి తీరుతుంది.

రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని …..
మళ్ళీ రేపటిరోజున – గతించిన ఇవాళ్టి గురించి ,చింతించేకంటే…

ఇవాళ అందినదానితో ఆనందిస్తూ , ఆస్వాదిస్తూ… రేపటికి స్వాగతం పలకడం ఉత్తమం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !