నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రాబోవు పార్లమెంటు ఎన్నికలలోశాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి బూర్గంపాడు పోలీసులు సారపాక లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది . ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా స్వచ్ఛందంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ పాల్వంచ సిఐ వినోద్ కుమార్, భుర్గంపాహాడ్ ఎస్సైలు సుమన్, నాగ బిక్షం ,6 ఎస్సైలు, 15 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, 10 TSSP సిబ్బంది, మరియు కానిస్టేబుల్స్ 10 మంది పాల్గొన్నారు. గ్రామంలో సాయుధ బలగాలతో కలిసి పోలీస్ అధికారులు గ్రామ లో తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, దానికి పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా కల్పిస్తున్నామన్నారు.