★ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకు రాగలుగుతుందా?!
★రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు ఎత్తేయడం అంత సులభమా?
★సీఎం రేవంత్ రెడ్డికి మైలేజ్ పెరిగిన భవిష్యత్తులో కష్టాలు తప్ప వేమో?
★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్
★కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ
నేటి గద్ధర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:డీప్ ఫేక్ వీడియో తో దేశ వ్యాప్తంగా చర్చలు నిలిచారు. ఎంతలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా అని అనే స్థాయికి వీడియో వైరల్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి Aicc లో టెన్ గ్రేట్ పాయింట్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు.వివరాలు …. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్స్ చేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్ప ది. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని CM రేవంత్ రెడ్డి బహిరంగ సమావేశాలలో ఘాటుగా ఆరోపించారు. ప్రజల్లోకి సైతం ఈ మాటలు అంతే వేగంగా చేరాయి. సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు.★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. బిజెపి నాయకులు సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసు నమోదయింది. రేవంత్ రెడ్డి మాటలు గ్రామాలకు చేరిన వాటిని విద్యావంతులు, ఓటర్లు ఎంతవరకు విశ్వసిస్తారో వెయిట్ చేయాల్సిందే. భవిష్యత్తులో రేవంతునికి కష్టాలు తప్పవ అనే చర్చ సైతం జోరుగా జరుగుతుంది.