నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆయన ఓ మండల మెజిస్ట్రేట్. అన్యాక్రాంతమైన భూమిని కాపాడడానికి తన విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా ఉంటున్న భూ యజమానులకు నోటీసు ఇవ్వబోయాడు. సదర్ భూ యజమాని ఓ తహశీల్దార్ నే ఫోటోలు తీసి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తహశీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. తహశీల్దార్ నాగ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ వీరాపురం క్రాస్ రోడ్డు వద్ద Survey No:9 ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇదే బెల్ట్ షాప్ ల కి గతంలో కరకగూడెం తహసిల్దార్ పాలూరి నాగ ప్రసాద్ రైతు వేషం లో వెళ్లి తనిఖీలు నిర్వహించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కస్తూరిబా పాఠశాల దగ్గరగా ఆ బెల్ట్ షాపు ఉండడమే ఇందుకు కారణమని తహశీల్దార్ అప్పట్లో తెలిపారు. అయినప్పటికిని నేటికి బెల్ట్ షాపు నిర్వాహకులు ఏలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తహసిల్దార్ నాగప్రసాద్ తన సిబ్బందితో శుక్రవారం మరో మారు ఆ షాపులను తనిఖీ చేయడానికి , అలాగే నోటీసులు జారీ చేయడానికి వెళ్లడం జరిగింది. దీనితో కోపాద్రిక్తులైన ఆ షాపు యజమానులు తహసీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఫోటోలు సైతం తీశారని తెలియవచ్చింది. ఓ మండల తహశీల్దార్ పై సంబంధిత షాప్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరును మండల ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.
*తహసిల్దార్ నాగప్రసాద్ వివరణ*
కరకగూడెం తాసిల్దార్ నాగప్రసాద్ ని నేటి గద్దర్ న్యూస్ వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా వ్యాపారం జరుగుతుండడంతో భట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోని వీరాపురం క్రాస్ రోడ్ లోని సర్వేనెంబర్ 9 లో అక్రమంగా వెలిసిన షాపులకు6,7A నోటీసులు ఇవ్వబోగా సంబంధిత షాప్ నిర్వాహకులు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారి Cell phone ఫోటోలు తీశారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సంఘటన వివరాలను కలెక్టర్ కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే అక్రమార్కులను ఎవరిని వదిలి పెట్టేది లేదని, వారిపై PD యాక్ట్ కేసు నమోదు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.