నేటి గద్దర్ న్యూస్, మే 06, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం :
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం పరామర్శించారు. పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మి బాయి శనివారం అనారోగ్యంతో మృతి చెందినారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హన్మకొండలో లక్ష్మి బాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బలరాం నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని వేడుకున్నారు. మంత్రి వెంట ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, డాక్టర్ అనీల్ తదితరులు ఉన్నారు.
Post Views: 181