+91 95819 05907

మతోన్మాద ఫాసిస్ట్ BJP ,దాని మిత్ర పక్షాలను ఓడించండి:CPI ml mass line

★ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ముద్దా బిక్షం

నేటి గద్ధర్ న్యూస్,ములకలపల్లి:
ములకలపల్లి మండల కమిటీ CPI ml mass line ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో ఎన్నికల జనరల్ బాడీ పార్టీ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ జనరల్ బాడీని ఉద్దేశించి మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ముద్దా బిక్షం మాట్లాడుతూ మతోన్మాద పాసిస్ట్ బిజెపిని దాని మిత్రపక్షలను ఓడించండి ప్రజాస్వామిక లౌకిక ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడదాం అని భారతదేశంలో 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ప్రచార చూడు అందుకున్నది పోలింగ్ దశలో ఆరంభమయ్యాయి ఎన్నికలు ఇన్నాళ్లుగా జరిగినట్లుగా సాధారణంగా జరుగుతున్న ఎన్నికలు కావు ఎవరో ఒకరిని ఎన్నుకోవలసిన సాధారణ స్థితిలో జరిగే ఎన్నికలు కావు.క్లిష్ట పరిస్థితులలో అత్యంత ప్రత్యేక పరిస్థితులలో జరిగే ఎన్నికలు. కానీ ఈ ఎన్నికలు మన ముందు ఒక కీలకమైన పరీక్షను ఉంచింది ఆ పరీక్ష ఏమిటంటే దేశంలో ఉన్న పరిమితమైన బూర్జోవ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా రక్షించుకోవాలా లేదా మనువాద పాసిస్తూ విధానానికి మతోన్మాద నరరూప హింసాకృత్యానికి అధికారం అప్పగించాలా అనేది ఆలోచించాలి రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులు ఓటింగ్ ఎన్నిక ఎంత బలహీనంగా ఉన్నా ప్రజలకు దానిలో నుంచి మెరుగైన లౌకిక ప్రజాస్వామిక విలువలను పెంపొందించుకోవాలని అంశం ఉండేది పెట్టుబడిదారీ సమాజంలో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారీ వర్గాల వ్యాపార లావాదేవీలను నడిపే యంత్రంగం అని మహోపద్యాయులు మార్క్స్ ఏంజిల్స్ కమ్యూనిస్టు ప్రణాళికలలో చెప్పారు అయినా కోట్లాది శ్రమజీవులకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు తమకు ఉందని అది మెరుగైన విలువలను అందిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు ఈ ఎన్నికలలో ఎన్నో పరిమితులు ఉన్నాయి ప్రజలు తమ డిమాండ్లను ముందుకు తెస్తూ ఉన్నారు.అయితే ప్రభుత్వాలు మాత్రం మోసపు వాగ్దానాలతో ప్రజలను ఏమార్చుతూ వచ్చాయి. బిజెపి మతోన్మాదపు ఎజెండా కార్పోరేట్ వర్గాల ఏజండగా తన ఆర్ఎస్ఎస్ ఏజెండర్ జావ్ర ఉమ్మడి సివిల్ కోర్ట్ చట్టం కాశ్మీర్లో 370 ఆర్టికల్,అయోధ్యలో రామాలయం నిర్మాణం తన మైనారిటీ మత వ్యతిరేక ఏజెండాలను అమలు జరిపింది.దేశంలో ప్రజల సమైక్య సహజీవనాన్ని దెబ్బతీస్తూ,విభజనలను,విద్వేషాలను పెద్ద ఎత్తున పెంచి పోషిస్తూ మరోవైపు లాభాలలో ఉన్న ఎల్ఐసి లాంటి సంస్థలను బ్యాంకులను రైల్వేలను ప్రైవేటీకరించింది.స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థల కాషాయకరణ ఎన్నికల ద్వారా అధికారం పొంది రాజ్యాంగ పరిధిలోని ప్రతి వ్యవస్థను సిబిఐ,ఈడి,ఐటి,ఎన్నికల కమిషన్,ఎన్ సి ఈ ఆర్ టి, చరిత్ర విభాగం,చివరకు న్యాయ వ్యవస్థ పైన తన ఆధిపత్యాన్ని సాగిస్తుంది. ప్రజా ఉద్యమంపై హక్కులపై తీవ్ర అణచివేత బిజెపి,ఆర్ఎస్ఎస్ లు మెజారిటీ హిందూ మతోన్మాదంతో సమీకరణలు చేస్తున్నది. అది అందరి ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకమైనది. ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రమే దానికి శత్రువులు కాదు హిందువులలోని 80% దళిత ఆదివాసి పేద బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది దానికోసం వారిలో మెజారిటీ ఉన్మాదాన్ని విద్వేషంగాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తుంది వాస్తవంగా బిజెపి ఎన్ డి ఏ కూటమి అనుసరించిన ఆర్థిక రాజకీయ విధానాలన్నీ ఈ దేశంలోని అన్ని మతాలలోని అన్ని కులాలలోని 90 శాతం ప్రజలకు వ్యతిరేకమైనదనీ మాట్లాడారు. కాంగ్రెస్ ఇతర మిత్ర పక్షులు ఈరోజు ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వన ఏర్పడింది ఇది పార్లమెంటరీ ప్రత్యామ్నయం కాంగ్రెస్ కాని దానితో జత కట్టిన పార్టీలు కానీ ఆర్థిక రాజకీయ విధానాలలో కార్పొరేట్ వర్గాలకు పెట్టుబడిదారి వర్గాలకు అనుకూల విధానాలే అనుసరించాయి వాటి అమలుకు ఇవే అద్యులు బాధ్యులు కానీ అవి మతోన్మాదాన్ని అనుసరించడం లేదు ఆ తేడాను గమనంలోనికి తీసుకొని ముఖ్యంగా మతవిద్వేషాలతో పాసిస్తూగా ముందుకు వచ్చిన బిజెపిని ఓడించాలి ఈ రెండు కూటములే ఉన్న దగ్గర బిజెపికి వ్యతిరేకంగా నిలబడేలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది అలానే నల్ల చట్టాలను రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని క్యాజువల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల స్థానంలో పర్మినెంట్ ఉద్యోగాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉపా చట్టాన్ని ఉపసంహరించలని ఆదివాసుల పూడి భూములకు పట్టాలు ఇవ్వాలని దళిత పేదలందరికీ విద్యా ఉద్యోగ గృహ వసతి గ్యారెంటీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నోపా భాస్కర్ జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ నిమ్మల రాంబాబు పూణేమ్ రమేష్ గోనెల రమేష్ మండల కమిటీ సభ్యులు యర్రాగొర్ల రామారావు,పుప్పల నాగేశ్వరరావు, ఓరుగంటి శ్రీను అద్దం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !