◆హాజరుకానున్న తుమ్మల, తమ్మినేని బలరాం నాయక్, పోతినేని
భద్రాచలం
ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కాంక్షిస్తూ సిపిఐఎం నేతృత్వంలో ఈ నెల 9వ తేదీన భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ లో భద్రాచలం పినపాక నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం నాడు చందర్రావు భవనలో జరిగిన పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని నివారించేందుకు బిజెపి పార్టీని ఓడించేందుకు ఇండియా బ్లాక్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం సిపిఐఎం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక భద్రాచలం నియోజకవర్గం పార్టీ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై కార్య చరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఈనెల 9న జరిగే విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశానికి సిపిఐ ఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినే సుదర్శన్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిసిసి జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య లు హాజరై ఐక్య కార్యచరణ రూపొందిస్తారని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐఎం కాంగ్రెస్ కలిసి ముందుకు వెళుతూ మౌబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు భీమవరపు వెంకటరెడ్డి ఎర్రం శెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ నాదెండ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు