◆పిల్లలను చదివించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం…
◆ఏటూరు నాగారం టీటీడబ్ల్యూఆర్జెసి ప్రిన్సిపాల్ తోకల రాజా రామ్
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(భుర్గంపాహాడ్):
విద్యార్థులు తమ చదువును ఇష్టపడి పట్టుదలతో చదివితే ఎంతటి కష్టసాధ్యమైన దానినైనా సుసాధ్యం చేయవచ్చునని ఏటూరు నాగారం టి.టి.డబ్ల్యూ ఆర్జెసి ప్రిన్సిపాల్ తోకల రాజారామ్ అన్నారు.
మండల కేంద్రమైన బూర్గంపాడు లోని అంబేద్కర్ కాలనీలో ఏబీఆర్ యూత్ ఆధ్వర్యం లో పదవ తరగతి,ఇంటర్మీడియట్ మొదట,ద్వితీయ సంవ త్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సన్మానిం చి సత్కరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సన్మానించిన రాజారామ్ మాట్లాడుతూ,పిల్లలు చిన్నతనం నుంచి చదువుపట్ల ఏకాగ్రత పట్టుదల తో ముందుకు సాగాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. విద్యాభివృద్ధి తోనే దేశా భివృద్ధి సాధ్యమవుతుందని అయన అన్నారు.చదువులు నేర్పే ఉపాధ్యాయులు,గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదివించడంలో పట్టుదల కలిగి ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. చదువుతూనే విద్యార్థులకు దూరమైన భవిష్యత్తు ఉంటుందని,చదువులను మధ్యన ఆపి వేస్తే ముందుకు సాగటం కొంత కష్ట సాధ్యమేనని ఆయన తెలిపారు.విద్యార్థులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పరిశీలన చేస్తూ తమ పిల్లల చదువులకు మంచి ఉన్నతమైన బాటలు వేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన లక్ష్యాన్నైనా చేరుకోచ్చని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ కాలనీలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించి సత్కరించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు.అనంతరం అంబేద్కర్ కాలనీకి చెందిన 13 మంది విద్యార్థులను శాలువాలతో పూలమాలతో సన్మానించి సత్కరించి స్వీట్ బాక్సు లను అందజేశారు.ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు తోకల మోహన్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఈ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు,కేసుపాక పుల్లయ్య, కేసుపాక మాధవి,కేసుపాక రఘురాం,వేణు,కేసుపాక అనూష తదితరులు ఈ విద్యార్థులను సన్మానించి సత్కరించి వచ్చే ఏడాది నుంచి ఈ కాలనీలో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు ప్రైజ్ మనీ అంద జేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేసుపాక పుల్లయ్య,ఇసంపల్లి వెంకటేశ్వర్లు, రాయల వెంకటేశ్వర్లు,తోకల రవి ప్రసాద్,కేసుపాక రవి, పాస్టర్ సుజీవ రాజు, నందిపాటి పండు, కేసుపాక రాజేష్,తోకల శంకర్రావు,కేసుపాక సీతారాంబాబు,కేసుపాక మల్లేశ్వరరావు,తోకల శ్రీను, అలవాల దుర్గా ప్రసాద్,కేసుపాక రఘురాం,కేసుపాక రేవంత్ సాయి,కేసుపాక రామకృష్ణ, తోకల వెంకటరమణ,వంశీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.