నేటి గద్దర్ న్యూస్, మే 06, బోనకల్ :
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని సోమవారం పోలీసులు తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో పోలీసులు అందరి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బోనకల్ మండల కేంద్రంలోని సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనం ఆపి తనిఖీలు పూర్తయ్యే వరకు భట్టివిక్రమార్క వాహనంలో కూర్చొని సహకరించారు. కారు వెనుక భాగం సహా అంతా తనిఖీ చేశారు. సహకరించినందుకు ఉపముఖ్యమంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 46