నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(చర్ల): వలస ఆదివాసీ లకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చెయ్యాలని రాష్ట్ర రెవిన్యూ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని చర్ల మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ…
చర్ల మండలంలో గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్న గిరిజన వలస ఆదివాసీలకు కుల దృవీకరణ పత్రాలు 2018వ సంవత్సరం నుండి నిలుపుదల చేయటం జరిగింది. కుల ధ్రువీకరణ పత్రాలు మరల వలస గిరిజన ఆదివాసీలకు మంజూరు చేయాలని, పోడుభూముల పట్టాలు మంజూరు చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో DCMS డైరెక్టర్ , చర్ల PACS చైర్మన్ పరుచూరి రవికుమార్, జడ్పీటీసీ ఇర్పశాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీ కృష్ణ, దేవభక్తుని రామకృష్ణ, ఎస్ సి సెల్ నాయకులు తోటమల్ల వరప్రసాద్ లు పాల్గొన్నారు.
Post Views: 228