సోమవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కర్నె రవి రెండో నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల డిగ్రీ,పీజీ ఉన్నత చదువులు చదువుకోని ఉద్యోగులు లేక నిరుద్యోగుల బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని కూలీ పనులకు వెళ్తున్నారని, గత పట్టభద్రుల MLC అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్పొరేట్ విద్యాసంస్థలు అదినేత నిరుద్యోగుల తరఫున గెలిచిన శాసనమండలిలో ఏ రోజు నిరుద్యోగుల తరఫున శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు నీ తిరిగి వివిధ శాఖల్లో తీసుకుని నిరుద్యోగుల పొట్టకొడుతున్న నోరు మూసుకుని కూర్చుంటే అడిగే వాళ్ళు ఎవరూ లేరని, నోటు తీసుకుని ఓటు వేసే పట్టభద్రులు ఇప్పుడు అయినా ఆలోచించండన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో 4,61,806 నాలుగు లక్షల ఆరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఆలోచన చేయండని, దేశంలో ఉపాధికి సంబంధించి చాలా విచిత్రమైన పరిస్థిత నెలకొంది ఆలోచించి నోటుకు ఆశపడి ఓటు వేయకండి అని కోరారు.