★ఆంధ్ర, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్న గోoడ్వానా దండకారణ్య పార్టీ
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(ఏజెన్సీ):
దేశంలో ఏజెన్సీ ప్రాంతాల రక్షణ, మనుగడ కొరకు సువిశాల దృక్పథం తో ఆవిర్భవించిన పార్టీ
గోoడ్వానా దండకారణ్య పార్టీ .ఈ పార్టీ కి ఓటు వేయడం ద్వారా..
మన ప్రాంతంలో.. మన పార్టీయే మనకు రక్షణ ఇస్తుందని , ఇండిపెండెంట్ అభ్యర్థులు పేరిట కొందరూ ఓట్లను చీల్చేయడమే ధ్యేయంగా, వ్యక్తిగత ప్రచారమే కోసమే పోటీ చేయుచున్నారనే విషయం ప్రస్ఫుటంగా అర్థం అవుతోందని వారు ఆరోపించారు. ముఖ్యంగా బినామీలకు ఓటు వేసి.. చేతులు కాల్చుకోకుండా.. జాతిని జాగృతం చేయడం, ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా ముందు వుంటామని..పార్టీ పేరు వింటేనే మన పుట్టు పూర్వోత్తరాలు గుర్తుకి తెస్తున్నాయని, షెడ్యూల్ ప్రాంతాలనూ రాష్ట్రాలుగా, జిల్లాలుగా, జోన్ లుగా విభజన చేస్తూ..
ఏజెన్సీ ప్రాంతాల ఉద్యోగులనూ జోన్లు, మల్టి జోనల్ పేరిట మైదాన ప్రాంతాలకు పంపిస్తున్నారనీ, అంతేకాకుండా ప్రమోషన్లలో ఇతరులనూ తీసుకువచ్చి అన్యాయం చేస్తున్నారని, ఇలాంటి అనేక సమస్యలకు.. పరిష్కార మార్గంగా ఏజెన్సీ ప్రాంతాలను ఒక యూనిట్ గా జొనల్ వ్యవస్థ ఉండేలా చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ఆస్థిత్వం, రక్షణకై, స్వయం పాలనే ధ్యేయంగా రెండు(మహబూబాబాద్, అదిలాబాద్) స్థానాలలో, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో పోటీ చేస్తున్న గొండ్వానా దండకారణ్య పార్టీతోనే సాధ్యం అవుతుందని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు.. ఇంకా అనేక మంది.. మూర్ఖంగా భూర్జవ పార్టీలనూ, వాటికి భినామిలుగా పోటీ చేస్తున్న వారిని నమ్మి మోసపోతూన్నారని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గల వనరుల దోపిడిని, అన్యాయాలనూ ప్రశ్నించే నాయకుడు గానీ, ఆదివాసుల అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయలేని స్థితిలో రాజకీయాలు తయారు అయ్యాయని, ప్రస్థుత తరానికి, అంతరించిపోతున్న ఆదివాసులకూ
గోoడ్వానా దండకారణ్య పార్టీకి ఒక సంజీవని అని, పార్టీని కాపాడుకుంటూషెడ్యూల్ ప్రాంతంలో గల ప్రతి ఒక్కరూ
గోoడ్వానా దండకారణ్య పార్టీకి తూర ఊదుతున్నా మనిష గుర్తుకిఓటు వేస్తామని, వేయాలని పిలుపునిస్తూ.. అభ్యర్థులకు భరోసా ఇస్తున్నారు.