+91 95819 05907

ఒక్క కేసీఆర్ బస్సు యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ప్రజల సమస్యల పరిష్కారానికి బాట వేసింది – మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:

మణుగూరు మండలం కట్టుమల్లారం గ్రామo మరియు తొగ్గూడెం గ్రామo సమావేశంలో మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ఐదు నెలలకే రేవంత్ రెడ్డికి ప్రజల నుండి తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు.
ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పథకాలు సరైన టైంలో ప్రజలకు చేరేవని, కళ్లిబోళ్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూ, ఉన్న పథకాలను కూడా సరైన టైమ్ లో ఇవ్వకుండా పెన్షన్లు ఒక నెల రెండు నెలలు తప్పించి ఇస్తున్నారని ప్రజలు చెప్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పైగా పోలీస్, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఫారెస్ట్, సింగరేణి, టీచర్స్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజంగాదా, రాష్ట్రవ్యాప్తంగా 1200 వందల కు పైగా గ్రామపంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏర్పాటుచేసి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించింది నిజం కాదా ! అందులో అదనంగా ఉద్యోగ నియమకాలు చేపట్టింది నిజంకాదా .12731 తండాలను గిరిజన గ్రామాలను గ్రామపంచాయతీలు గా ఏర్పాటుచేసి జూనియర్ కార్యదర్శులు నియమించి వారిని పేర్మినెంట్ చేయలేదా!!
అందులో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి నెలకు 8,500 జీతం ఇచ్చింది నిజం కాదా.పవర్ ప్రాజెక్ట్ బీటీపీస్ లో 300 పైగా ఉద్యోగాలు కల్పించింది నిజం కాదా.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతోపాటు, కారుణ్య నియామకాలు మరియు 700 పైగా బదిలీ వర్కర్స్ ఉద్యోగ నియమాకాలు చేపట్టలేదా.
కెసిఆర్ ప్రభుత్వంలో చేపట్టిన 26వేల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చింది నిజం కాదా?పినపాక నియోజకవర్గం లోని 16800 పోడు భూముల సాగుదారులకు 56000 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చి వాటికి రైతుబంధు, రైతు బీమా నిజం కాదా?
నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో నిండు సభలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు పథకాలు అమలవుతున్నాయని ప్రతి మహిళకు 2500 ఎకౌంట్లో పడుతున్నాయని అబద్దాలు చెప్పింది నిజం కాదా!
ఇన్ని మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈనెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో తోగ్గుడెం, కూనవరం మాజీ సర్పంచ్ బొగ్గo రజిత, ఏనిక ప్రసాద్, జగడి జ్యోతి, మండల కో ఆప్షన్ సభ్యులు జావిధ్ పాషా, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ, మేకల రవి,మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి రామిరెడ్డి, రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, ఉడతనేని రవి,జగిడి ప్రసాద్, ఆడబాల సత్యవతి,పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !