నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం :
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం లోకి వచ్చారు
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది
భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ మీదుగా యు బి రోడ్ .ఇందిరా మార్కెట్. తాతగుడి సెంటర్. రామాలయం సెంటర్ వరకు ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కార్యకర్తలు తో కలిసి ప్రతి ఇంటికి .షాప్ షాప్ కి తిరిగి స్వయంగా ఓట్లు అభ్యర్దించారు…
కెసిఆర్ పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉందని నాలుగు నెలల కాలంలోనే రైతాంగం నానా ఇబ్బందులు పడుతుందని రైతుల ఉచిత కరెంటు ఆడబిడ్డలకు తులం బంగారం 2500 రూపాయల డబ్బులు ఎటుపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆరు గారెంటీలు పూర్తిగా అమలు అయినా గ్రామంలో బస్తీలలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని. 6 గ్యారంటీ పథకాలు అమలు గాని గ్రామాల్లో బస్తీల్లో కాంగ్రెస్ ఓట్లు అడగకూడదని దీనికి సిద్ధమ అని ప్రశ్నించారు..
ఈ కార్యక్రమంలో రావులపల్లి రాంప్రసాద్. మానే రామకృష్ణ. సత్యాలు. ఆకోజు సునీల్ కుమార్. రేపకా పూర్ణచంద్రరావు. ఉడతా రమేష్. ధనం. సీతామహాలక్ష్మీ. కోలా రాజు.సూరిబాబు. రమాదేవి. పట్టాభి. నర్సింహులు. బూత్ ఇంచార్జి లు పాల్గొన్నారు