★ఆ చిన్నారి పలుకులకు మంత్రముగ్ధులైన BRS నాయకులు
నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు: మణుగూరు మండలంలోని అతి మారుమూల ఆదివాసీ గ్రామం బుగ్గ. ఆ గ్రామానికి మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారానికి వెళ్లారు. నమూనా EVM మిషన్ పై ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలో అక్కడి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి ఆ ఈవిఎం దగ్గరికి వచ్చి CAR బటన్ నొక్కుతూ KCR తాత KCR తాత అంటూ కేరింతలు వేసింది. ఆ చిన్నారి చిలుక పలుకులకు బి.ఆర్.ఎస్ శ్రేణులు మంత్ర ముగ్దులు అయ్యారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కెసిఆర్ పేరు మారుమూల గ్రామాల్లోకి వెళ్ళింది అనడానికి ఈ సంఘటన నిదర్శనమని వారు మాట్లాడుకున్నారు.ఇది ఇలా ఉండగా మణుగూరు మండలంలో బీఆర్ఎస్ మండల నాయకులు మహబూబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత విజయం కాంక్షిస్తూ గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి సైతం విశేష స్పందన లభిస్తుంది.ఎన్ఆర్ఈజీఎస్ 100 రోజుల కూలీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఓటును అభ్యర్థిస్తున్నారు. మాలోత్ కవిత గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది.