★ వివరాలు వెల్లడించిన మణుగూరు DSP వి.రవీందర్ రెడ్డి
★ హత్యలకు, ఘర్షణలకు నిలయంగా బెల్ట్ షాపులనే కథనం నేటి గద్దర్ న్యూస్ లో మంగళవారం ప్రచురించిన విషయం పాఠకులకు వివిధమే.
నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు): మణుగూరు మండలంలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మణుగూరు DSP V. రవీందర్ రెడ్డి బుధవారం పత్రిక ప్రకటన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు PK1 సెంటర్ విటల్ రావు నగర్ కు చెందిన గుగులోతు మురళీకృష్ణ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య యజ్ఞానికి ప్రయత్నం చేసిన అదే ప్రాంతానికి చెందిన కుర్రం నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు DSP తెలిపారు. హత్యయత్నం కు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమాండ్ నిమిత్తం మణుగూరు JFCM కోర్టులో హాజరు పరిచయం జరిగిందన్నారు. మణుగూరు పీకే వన్ సెంటర్ లో జరిగిన ఘర్షణపై నేటి గద్దర్ న్యూస్ లో మంగళవారం ప్రచురించగా జిల్లా వ్యాప్తంగా చర్చాంసనీయంగా మారింది.