◆మాలోత్ కవితను గెలిపించండి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వట్టం.రాంబాబు
నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని కన్నాయిగూడెం,కల్వలనగారం,వెంకటాపురం గ్రామాలలో,పినపాక మాజీ శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని గెలిపించాలని కోరుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రావుల సోమయ్య, ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గం ఇంచార్జి వట్టం రాంబాబు మాట్లాడుతూ.బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే బ్రష్టు పట్టించిందని. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని అన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని భారీ మెజార్టీతో గెలిపించాలని హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ప్రజలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అయన అన్నారు.రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్ ధ్వర్యంలో జరిగింది అన్నారు ప్రజలు మరోసారి మోసపోకుండా బిఆర్ఎస్ కు మద్దతు పలకలన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు.గతంలో 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు సమృద్ధిగా సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందిని సాగునీరు కరెంటు వంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు, మనకోసం మన రాష్ట్రం కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు, ఆరు గ్యారెంటీల అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు ఏడ్ల శ్రీనివాస్ పినపాక నియోజకవర్గం రేగా సోషల్ మీడియా సభ్యులు గిద్దె సాయికిరణ్, శేఖర్,కల్తీ నరేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
