నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:కరకగూడెం మండలం రేగుళ్ళ,బుర్దరం,కొర్నవల్లి, కరకగూడెం,లక్ష్మీపూరం, కన్నాయిగూడెం,గ్రామలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి మైపతి అరుణ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదివాసీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తు సింహం గుర్తుపై ఓటు వేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాలని,అన్ని వర్గల ప్రజలను ఓటు అభ్యసిస్తున్న ఆదివాసీ నాయకులు.ఈ సందర్భంగా ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థి నాయకులు అరెం.అరుణ్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన ఆదివాసీ కులాల పట్ల నిర్లక్ష్యం చూపెడుతున్న పార్టీలకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్పాలని వారన్నారు.సింహం గుర్తుకే మన ఓటు వేసి గెలిపించాలని అయన కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు సుతారి.నాగేశ్వరరావు, పోలెబోయిన.గణేష్, కొమరం.రాంబాబు, మల్కం.నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 47