★మంత్రి తుమ్మల సమక్షంలో భారీగా చేరికలు
★ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం: Mla డా.తెల్లం
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(భద్రాచలం): భద్రాచలం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.BRS వాటికి చెందిన సుమారు 500 మంది
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య ల సమక్షంలో భద్రాచలం Mla డా.తెల్లం వెంకట్రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో 500 మంది జాయిన్ అయ్యారు. వారికి మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీదల కష్టాలు తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇందిరామరాజ్యం కాంగ్రెస్తో సాధ్యమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.