★ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు
బుద్ధి చెప్పాలి
★ కాంగ్రెస్ పథకాలను ప్రశ్నించాలి అంటే బి ఆర్ ఎస్ కు ఓటెయ్యండి
★ మళ్లీ మోసపోతే గోసా పడతారు
★ వాజేడు వెంకటాపురం మండలాలలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విజయం కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేసిన బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(వాజేడు, వెంకటాపురం): ములుగు జిల్లాలో ని అతి మారుమూల మండలాలు వాజేడు వెంకటాపురం లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం BRS అభ్యర్థి మాలోత్ కవిత విజయం కాంక్షిస్తూ గురువారంవిస్తృత ప్రచారం నిర్వహించారు. సబ్బండ వర్గాలను కలుస్తూ CAR గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బి ఆర్ ఎస్ శ్రేణులు సైతం దండులా రేగాతో కదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సమావేశాలలో ఆయన మాట్లాడారు.అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు
బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పథకాలను ప్రశ్నించాలి అంటే బి ఆర్ ఎస్ కు ఓటెయ్యండి అని కోరారు.మళ్లీ మోసపోతే గోసా పడతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు, మణుగూరు మండలాల టిఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.