– ఉపాధి పనులు తెచ్చిందే కాంగ్రెస్
– బలరాం నాయక్ గెలుపు తథ్యం
– నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు
నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం :
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కులమత ప్రాంతాలకు అతీతంగా బలరామన్నను గెలిపించుకోవాలని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా గురువారం నాగినేని ప్రోలు గ్రామంలోని ఉపాధి కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వారికి అల్పాహారం అందించారు. వారితోపాటు కొద్దిసేపు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడమ కంటి పిచ్చిరెడ్డి, మాదినేని వెంకటేశ్వరరావు(ఎర్రబాబు) తదితర నాయకులు మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డ అని మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తూ రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు భరోసా కింద నిధులు మంజూరు చేయనున్నారని వారు పేర్కొన్నారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఐటిడిఏ లను, బొగ్గు గనులను, ఉక్కు పరిశ్రమలను తదితర పరిశ్రమలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి 2000 కోట్ల రూపాయలు నిధులను తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటేనే ప్రజలకు ప్రజాస్వామ్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడమ కంటి రోసి రెడ్డి, గాద వెంకటేశ్వర రెడ్డి, యువజన నాయకులు ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, దుగ్గెంపూడి శేశిరెడ్డి, పాలెం లక్ష్మారెడ్డి, బానోత్ రాందాస్, కాటం వెంకట్ రెడ్డి, ఏరువా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.