◆కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:ఏడవల్లి కృష్ణ
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(పాల్వంచ) మే 9:
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం పరిధిలోని కిన్నెరసాని, రాజపురం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ విసృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమములో ప్రజలను ఉద్దేశించి ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ,ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న పాల్వంచలో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే, మనం అందరం కూడా హస్తం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు రామ సహాయం రఘు రామ రెడ్డికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.మోడీ ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారని,దేశానికి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు.ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,ఏ బ్లాక్ అద్యక్షులు చావా వీరయ్య చౌదరి,ఓబీసీ మండల అధ్యక్షులు కట్ట సోమయ్య,ఓబీసీ టౌన్ అద్యక్షులు చారి,మైనార్టీ జనరల్ సెక్రటరీ హిమని,సాంబయ్య,కుర్సం వెంకటేశ్వర్లు,తాటి సురేష్,బండి నాగరాజుకల్తీ పెదబాబు, రాములు నాయక్,ఆలకుంట గణేష్ తదితరులు పాల్గొన్నారు.