నేటి గద్దర్ న్యూస్ జూలూరుపాడు మండలంలోనీ సాయిరాంతండా గ్రామ పంచాయతీకి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నుండి 8 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా లేళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ జూలూరుపాడు మండలంలోని ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుందని ఇప్పటివరకు చాలా కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో అధిక సంఖ్యలో జాయిన్ కావడం జరిగింది అని రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని మండల వ్యాప్తంగా కనుమరుగయ్యేలా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, వెంగన్నపాలెం ఎంపీటీసీ మధుసూదన్ రావు, దారావతు రాంబాబు,దుద్దుకూరు సుమంత్,మోదుగు రామకృష్ణ, దుద్దుకూరు నరసింహారావు, వెంకటనారాయణ,బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
