పాల్వంచ వెంకన్న దహన సంస్కరణలకు 3000 రూపాయలు వితరణ…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (మణుగూరు) మే 9:
మణుగూరు మండలం పరిధిలోని చెరువు ముందు సింగారం గ్రామానికి చెందిన పాల్వంచ వెంకన్న 58 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మరణించారు.నిరుపేద గిరిజన కుటుంబం కావడంతో,ఈ విషయం తెలిసి స్పందించిన మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాల్వంచ వెంకన్న కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం 3000/- రూపాయలు దహన అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడు మంగి మల్లికార్జున్ యాదవ్,
గ్రామ పెద్దలు సొడె రవి,ఉండం శ్రవణ్,ఏనిక బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 399