నేటి గద్దర్ న్యూస్,జూలూరుపాడు:
మండల పరిధిలోని గుండేపూడి గ్రామం లో మేకల కాపరి అయినటువంటి ఆవుల గోపుయ్య వడ దెబ్బ తగిలి మృతి చెందారు నిరుపేద కుటుంబం అయినా ఆవుల గోపయ్య కుటుంబానికి సుమంత్ వారి ఫ్రెండ్స్ సహకారంతో ఆ కుటంబానికి కింటా బియ్యం అందించారు, ఈ సందర్భంగా దుద్దుకూరి సుమంత్ మాట్లాడుతూ రేక్కడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి కుటుంబాలు ప్రతి ఒక్క గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం అటువంటి కుటుంబాలకు మనకు ఉన్నంతలో మనం సహాయం చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు కాళ్లూరి వెంకటేశ్వరావు,తూము కోటయ్య,పొన్నేకంటి వెంకటయ్య,గాదె కృష్ణయ్య, యండపల్లి చిట్టిబాబు, వేల్పుల గోపాలకృష్ణ, మద్దిబోయిన నాగరాజు, గోగుల వెంకటేశ్వర్లు, కంచర్ల శేఖర్,పునాటి వెంకటేశ్వర్లు,పొనుగుపాటి సుధీర్, అనగంటి సాయి,గంగయ్య, ఎల్లంకి తిరుపతిరావు,మద్దిబోయిన వెంకటేశ్వర్లు,బానోత్ సైదులు గరిక ప్రభాకర్, మద్దిబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
