★ఈ బువ్వ తినేదెట్లా…. చదివేదేలా?!
★మీ పిల్లల కు ఒక్క పూట ఈ బువ్వ పెడతారా?మేడం
★ అర్ధాకలి తో హాస్టల్ విద్యార్థులు
★ సెమిస్టర్ పరీక్షల పైన ప్రభావం
★ సమస్యలను విన్నవిస్తే టీసీ ఇస్తామని బెదిరింపులు?
★ ITDA అధికారులకు పట్టింపు లేదా?
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
★ ఆ హాస్టల్ విషయం నా దృష్టికి రాలేదు, విచారణ చేస్తాం: ఐటీడీఏ డిడి మణెమ్మ
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: పురుగుల అన్నం …. చాలీచాలని కూరలు…. విరసి అర్ధాకలితో పస్తులు ఉంటున్న విద్యార్థులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ హాస్టల్లో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. మా హాస్టల్ దుస్థితిపై నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక కథనం. విద్యార్థుల కథనం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్ట గూడెంలో టి టి డబ్ల్యూ ఆర్ డి సి మణుగూరు గురుకుల డిగ్రీ కాలేజ్ కలదు. సుమారు 300 వరకు విద్యార్థులు గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు రావడం జరుగుతుంది. అన్నం సైతం ముద్దుల ముద్దలుగా ఉంటుంది. ఒకవైపు సెమిస్టర్ పరీక్షలు… మరోవైపు అర్ధాకరి బతుకులు దీనితో విద్యార్థుల పరీక్షలపై ప్రభావం పడుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోటే హాస్టల్లో ఈ దుర్భర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు ఆవేదన వెలుబుచున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి హాస్టల్ పై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇలా ఉండగా విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్న విషయాన్ని ఆ గురుకులం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లాగా TC ఇస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ITDA DD వివరణ: ఇదే విషయమై ఐ టి డి ఏ డి డి మన్నెమ్మను నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఆ హాస్టల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి రాలేదని, ఆ గురుకులాన్ని విజిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తానని వివరణ ఇవ్వడం జరిగింది.
