నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలంలో కేకే ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.
నియోజకవర్గం లో 500మంది నాయకులు, కార్యకర్తలు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశాలతో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు , డిసిసి అధ్యక్షులు పోదేo వీరయ్య చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీలో చేరారు..
పార్టీలో చేరిన వారిలో కొండిశెట్టి కృష్ణమూర్తి, రత్నం రజీనికాంత్, అరికెల తిరుపతిరావు, తాళ్ల రవికుమార్, కూరపాటి ప్రసాద్ రాజు, కొప్పుల శ్రీను, కాపుల శ్రీను, బండారు కృష్ణ, క్రాంతి, ఫయాజ్ మరియు మహిళా నాయకురాలు జాస్తి గంగాభారతీ, పిట్టల లక్ష్మీకాంతం,కేతినేని లలిత, జ్యోతి, సుజాత , కాసింబి, మైధిలిబి, విజయలక్ష్మి, శారద, రసూల్ బి, మరియు అనేకమంది మహిళా నాయకులు జాయిన్ అయ్యారు..
ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ నాయకులు ఎస్.కె రసూల్, తోటకూరల రవి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ చింతిర్యాల రవికుమార్, యశోద రాంబాబు, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,అడబాల వెంకటేశ్వర్లు మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, సరెళ్ళ నరేష్, చుక్క సుధాకర్, చింతాడి చిట్టిబాబు, మైనారిటీ సెల్ అధ్యక్షులు అలీం,నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చింతిర్యాల సుధిర్, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదిప్, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, రాజేష్ , రామకృష్ణ, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు…
