భద్రాచలం లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటించారు పర్యటనలో భాగంగా భద్రాచలం జ్ఞాన మందిరం గుట్టపై నుండి రామాలయం వ్యూ పాయింట్ను తిలకించారు
దీనిలో భాగంగా ఆయన రామాలయ అధికారులతో మాట్లాడుతూ రామాలయ ఆలయ అభివృద్ధికి ఎన్ని ఇల్లులు డెవలప్మెంట్ లో భాగంగా తొలగించవలసి వస్తుందో వీలైనంత త్వరగా నివేదిక అందించాలని,అలాగే రాములయ్య మాడవీధులు అభివృద్ధి కూడా మా ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చేసి చూపెడతామని రామాలయ కళ్యాణం ప్రాంగణమైన మిథిలా ప్రాంగణంలో స్టేడియం వద్ద సోలార్ ఏర్పాటు చేయాలని సోలార్ అమర్చితే సోలార్ వలన విద్యుత్తు ఉత్పత్తి అయ్యి సామాన్య విద్యుత్తు అసౌకర్యం తగ్గుతుందని అధికారులు ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆయన రామాలయ్య అధికారులకు సూచించారు
భద్రాచల రామాలయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని ఆ విధంగా చేసి చూపెడతామని దేశంలో ప్రస్తుతం అయోధ్య పేరు ఎలా వినపడుతుందో మరొక సంవత్సరంలో భద్రాచల రామాలయం పేరు దేశమంతా అదే విధంగా వినపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీనియర్ నాయకులు రసూల్ , యశోద రాంబాబు తోటకూరి రవిశంకర్,
తదితరులు పాల్గొన్నారు.
