◆BRS భద్రాచలం నియోజకవర్గ సమన్వయ నాయకులు మానే రామకృష్ణ.
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
300 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అవాస్తవం.చేరిన వారు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు.కొంతమందిని పార్టీ సస్పెండ్ చేసింది.
అంతేగాని నిజమైన బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు పార్టీ మారలేదు అని BRS భద్రాచలం నియోజకవర్గ సమన్వయ నాయకులు మానే రామకృష్ణ. అన్నారు.
భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో 300 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వస్తున్న వార్తలు అవాస్తవమని. చేరిన వారు గత కొంతకాలంగా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కొంతమంది వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని కొంతమందిని పార్టీ సస్పెండ్ చేసిందని అంతేతప్ప నిజమైన గులాబీ కార్యకర్తలు ఎవరు పార్టీ మారలేదని క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రకటనలు ఖండిస్తున్నామని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మానే రామకృష్ణ అన్నారు..
ఎన్నికల అప్పుడు అధికారం తారుమారు అయినప్పుడు ఇలాంటి చేరికలు .రాకపోకలు సాధారణమని బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా మాలోత్ కవిత గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కష్టకాలంలో పార్టీతో ఉన్నవారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.