– బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
– విస్తృత ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నాయకులు
నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మానుకోట (మహబూబాబాద్) పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సారపాక పంచాయతీలోని పలు కాలనీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలే, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రిపీట్ కానున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలను అమలు చేశారని ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో రైతుబంధు, రైతు భీమ, రుణమాఫీ తదితర కార్యక్రమాలను అతి త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ప్రజలు ఆశించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యం రానున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోట అని, ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. ప్రతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసే ఒక్కో ఓటు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, గుంటక శేషిరెడ్డి, బండారు ముత్యాలరావు, సారపాక గాంధీనగర్ ని ముఖ్య కార్యకర్తలు సైదులు, ఈశ్వర్, కళ్యాణ్, అజయ్, గంగరాజు, శ్రీను, శంకర్, కామేశ్వరి, పాండు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.