నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి( మే 9):
పాలమూరు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డీకే అరుణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గురువారం జడ్చర్ల మున్సిపాల్టీ హౌసింగ్ బోర్డు, విద్యానగర్ కాలనీల్లో 8, 9వార్డు పరిధిలోని బూత్ నెంబర్లు 145, 148లో పాలమూరు బిజెపి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కి మద్దతుగా బిజెపి నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరిగి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందజేసి బిజెపి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్రమ సంఖ్య నెంబర్1 పై కమలం పువ్వు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. మరోసారి బిజెపి అభ్యర్థులను గెలిపించుకొని బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జి బీ.రాజశేఖర్ రెడ్డి, ఉల్చకోటి బాల్ రెడ్డి, శీలం రాఘవేందర్, శేఖర్ రెడ్డి, భీమ్ రాజ్, యేసయ్య, విశాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రాము, రంజిత్ రెడ్డి, హబీబ్, తిరుపతయ్య, చందర్ నాయక్, గణేష్, నర్రా ప్రతాప్ రెడ్డి లతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
