★ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా.
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4:00 గంటల వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, భద్రాచలం మరియు అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 112 సమస్య త్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆమె తెలిపారు. జిల్లా లోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.పార్లమెంటు ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ప్రకటనలో తెలిపారు.
Post Views: 53