పినపాక లో భారీ వర్షం…. జంకుతున్న జనాలు
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (పినపాక): పినపాక మండలం లో పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇంతకాలం భానుడి ఉగ్రతాపానికి గురైన మండల ప్రజలు కురిసిన వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. కాగా ఇటీవల కురిసిన రెండు భారీ వర్షాల మూలంగా రైతుల పంటలు దెబ్బతినడంతో పాటు, పలువురు నిరుపేదల గుడిసెలు సైతం నేలమట్టమయ్యాయి. కొందరు ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనితో వర్షం అంటేనే ప్రజలు జంతువుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 217