– ఏఈఓ సస్పెండ్ పై భిన్నాభిప్రాయాలు
నేటి గద్దర్, మే 11, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ ను సస్పెండ్ చేస్తూ దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన ఓ భక్తురాలు వద్ద ఒక సత్రం నిర్మాణం కోసం 15 లక్షల నగదు తీసుకొని, వారి పేరుతో సత్రాల నిర్మాణం చేయకుండా నగదు తిరిగి ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ప్రత్యేక అధికారితో ఇటీవల విచారణ జరిపించినట్లు సమాచారం. విచారణ అనంతరం ఏఈఓ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
– ఏఈఓ సస్పెండ్ పై భిన్నాభిప్రాయాలు
ఈ విషయంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తిస్థాయిలో జరిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ విచారించి ఉంటే మరిన్ని విషయాలు బహిర్గతం అయ్యేవని పలువురు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.