– ప్రజలు ఓటర్లు అధికారులకు సహకరించాలి
– ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవు
– జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్
నేటి గద్దర్, మే 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఈరోజు సాయంత్రం 4:00 గంటల నుండి 14.05.2024 సాయంత్రం 6:00 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవ్వరు లోపలికి రాకూడదని సూచించారు. జిల్లాలో ప్రజలు ఇట్టి విషయం పైన దృష్టి సారించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తే అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సీ-విజిల్ యాప్ ద్వారా గానీ, డయల్ 100కి ఫోన్ చేసి గానీ దగ్గరలోని పోలీసు అధికారులకు గానీ సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మన జిల్లాలో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుందని,ప్రజలంతా ఇట్టి విషయాన్ని గమనించి తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని ఆయన కోరారు.