– నాలుగురోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
– ఒక్కో రోజు ఒక్కో మండలంలో…
– 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి
– 19న తిరుమలాయపాలెం, 20న కూసుమంచి
– ఆయా మండలాల్లోని ప్రతి గ్రామంలో 20నిమిషాల పాటు సమావేశం
– ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొంగులేటి సరికొత్త పంథా
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(ఖమ్మం) : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయానికి బాధితులను రప్పించుకునే అవసరం లేకుండా పాలేరు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపిక చేసిన పలు గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి, 19న తిరుమలాయపాలెం, 20న కూసుమంచి మండలాల్లో ఆయన పర్యటన సాగనుంది.