★ పామాయిల్ తోట అగ్నికి ఆహుతి
★ డ్రిప్పింగ్ పైపులు సైతం పూర్తిగా దగ్ధం
★రూ లక్షల్లో నష్టం
★వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని ప్రకటించిన మంత్రి తుమ్మల
★రెండవ రోజే ఈ ఘటన
★ప్రభుత్వం ఆదుకోవాలి: బాధిత రైతులు
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో పామాయిల్ మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది.బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాండ్ల అశోక్ ఎకరం 50 సెంట్లు, చిత్తలూరి సత్యం రెండు ఎకరాల 50 సెంట్లు, గాండ్ల విజయ్ ఎకరం 50 సెంట్ల లో గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో పామాయిల్ పంట సాగు చేశారు . బాధిత రైతులు ఎంతో శ్రమకు వచ్చి పామాయిల్ మొక్కలు ఏపుగా రావడానికి నిరంతరం శ్రమించారు. వారి కష్టానికి ఫలితంగా మొక్కలు ఏపుగా పెరగడం జరిగింది. కానీ వారి ఆశలను ఓ రైతు తన పొలంలోని వరి కొయ్యలను కాల్చడానికి. గురువారం పెట్టిన ఎరగడ పామాయిల్ రైతులకు శాపంగా మారింది.ఎరగడ మంటలు పామాయిల్ తోటకు వ్యాప్తి చెందడంతో తోటలోని మొక్కలు డ్రిప్పింగ్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనితో ఆయా రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని ప్రకటించిన మరునాడు ఈ సంఘటన జరగడం కొసమెరుపు. కాగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరడమైనది.