+91 95819 05907

మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో మారణ హోమం :మావోయిస్టు పార్టీ

★కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ(బీకే-ఏఎస్ఆర్) ఆజాద్ పేరు న లేఖ విడుదల
నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి:మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో కేంద్ర ప్రభుత్వం అడవుల్లో మారణ హోమం సృష్టిస్తుందని ఆజాద్ పేరున విలేకరులకు గురువారంలేఖ ను విడుదల చేశారు.
భారత విప్లవోద్యమ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దాం
మావోయిస్టు పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారు. బూటకపు ఎన్కౌంటర్లను, నిజమైన ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ దాడి విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిలో భాగమే
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ దాడి ఇది విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిలో భాగమే. ఆపరేషన్ కగార్ దాడిలో భాగంగానే గ్రామాలపైపడి దాడులు, అత్యాచారాలు చేస్తూ మావోయిస్టు పేరుతో ప్రజలను దొరక బట్టి చంపడం, బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లుగా చిత్రీకరించడం చేస్తున్నాయి. ఇలాంటి దాడులు ( అధర్మ యుద్ధం) ఈ రాజ్యానికి కొత్తేమీ కాదు. మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో మారణ హోమం సృష్టిస్తూ గత మూడున్నర నెలల కాలంలో ప్రభుత్వ భద్రత బలగాలు, అర్థ సైనిక బలగాలతో 103 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వారిలో 60 మంది ఆదివాసి మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ నిర్మూలనలో భాగంగానే ఈ హత్యలు జరిగాయి. 2024 నాటికల్లా మావోయిస్టు పార్టీని మట్టుబెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితమే ప్రతీనబూనారు. మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారుచేయడంకోసం ఆదివాసీ ప్రాంతాలను, ఏకంగా దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం కోసం ఈ దాడుల పరంపర కొన సాగుతుంది. విప్లవకారులపై జరిగిన ప్రతీ దాడిలో సాయుధ బలగాలు ప్రజలను పట్టుకొని నిర్థాక్షణ్యంగా కాల్చి చంపి హత్యలు చేశాయి వాటికి ఎన్కౌంటర్లని పేరు పెట్టి మీడియాలో ఊరేగుతున్నాయి. బిజెపి ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా దేశాన్ని శాసిస్తూ కోర్టులను, జైళ్ళను, సిబి, ఉపా(UAPA) లాంటి క్రూరమైన సంస్థలని, చట్టాలను తీసుకువచ్చి హక్కుల కోసం ఉద్యమించే ప్రజలను, విప్లవోద్యమ పోరాటాలను అణచివేస్తున్నాయి. గత ఏడాది కాలంగా చత్తీస్ఘడ్ అడవులు, ఆదివాసి ప్రజలపై గ్రామాలపై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తూ, అమాయకులపై రాజ్యం చేస్తున్న అధర్మయుద్ధం చరిత్రలో నిలిచిపోయేలా అడవుల్లో ఆకాశంనుంచి జనావాసాలను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులతో ఆదివాసీప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. పార్టీ నాయకత్వ శ్రేణులను ఎంచుకొని వారిని నిర్మూలించడం ద్వారానే విప్లవోద్యమాన్ని సమూలంగా తుద ముట్టించవచ్చనే నెపంతో తెరిపి లేకుండా నిత్యం దాడులు చేస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలలో భాగంగా గ్రామాలలో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకునే గ్రామీణులను చావ బాదుతున్నారు. విచ్చలవిడిగా ఆదివాసిలు నివసిస్తున్న ప్రాంతాల్లో కాల్పులు జరపడం ద్వారా గ్రామీణ ప్రజలలో భయ బీభత్స వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అత్యంత విలువైన ప్రకృతి వనరులను కలిగిన ఖనిజ సంపదను, వనరులను కొల్లగొట్టుకు పోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ శక్తుల ఘరానా దోపిడికి అడ్డుగా నిలిచి ప్రజలను నూతన ప్రజాతంత్ర విప్లవ పంధాలో విప్లవింపజేస్తున్న మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు బలగాలు పొరుగు రాష్ట్ర ప్రభుత్వా బలగాల సమన్వయంతో శిక్షణ. గాలింపు చర్యలు దాడులు కొనసాగిస్తున్నాయి.

…….
ప్రజాహిత సంఘాలపై ప్రభుత్వం కన్ను వేసి వాటి ప్రతి కార్యక్రమం పై నిఘా ఉంచి వాటిలోని చురుకైన నాయకులపై సంస్థలుపై వేధింపులు కొనసాగిస్తున్నాయి. కేంద్రంలో మోడీ అధికారంలో వచ్చినప్పటినుండి గడిచిన కాలంలో ఆదివాసి ప్రజలు తమ రాజ్యాంగబద్ధ హక్కుల కోసం ఉద్యమించగా 10 వేలమంది ఆదివాసీలపై దేశద్రోహం చట్టాన్ని అమలు చేశారు. అక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పలు నిజ నిర్ధారణ కమిటీలు దర్యాప్తు జరిపి పోలీసుల దాష్టికాన్ని ఖండించిన విషయం విధితమే. గెరిల్లా దళాలలో పార్టీ శ్రేణులలో పనిచేస్తున్న కార్యకర్తల కుటుంబాలపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ వారిని లొంగదీసుకోవడానికి పార్టీలలో కోవర్టులుగా మార్చుకోవడానికి అత్యంత మోసపూరిత కుట్రలకు పాల్పడుతూ ప్రలోభాలకు పూనుకుంటున్నారు. తుపాకులు డబ్బులతో పారిపోయి వచ్చి తమ వద్ద సరెండర్ కావాలని చెబుతున్నారు. ఆదివాసి త్యాగాలతో రక్తసిక్తమవుతున్న అడవులలో ప్రభుత్వాలు రహదారులు వేస్తూ అడవులను ఖాకీమయం చేసి అపారమైన ప్రకృతి వనరులను తరలిస్తున్నాయి. అడవుల్లో ఆదివాసి హక్కులను హుళక్కి చేస్తూ కొత్త చట్టాలను రూపొందిచూస్తున్నాయి. రాష్ట్రంలో ఆదివాసి ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ఆదివాసికి న్యాయం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిస్సహాయులైన ఆదివాసి ప్రజలను పీడిత ప్రజల వెంట మేమున్నామంటూ ఈ దేశం గొంతెత్తి నినాదించాల్సిన తరుణం ఇది. సంవత్సరాలుగా పైగా ఆదివాసి ప్రజలపై ఇప్పుడు కగార్ దాడితో ఎడతెరిపిలేని సైనిక దాడులకు గురవుతున్న ప్రజలు రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడ్డానికి హక్కుల సంఘాలు మరింత చొరవతో చురుగ్గా పనిచేసి అక్కడ ప్రజలకు రక్షణగా నిలవాలని కోరుకుంటున్నాం అక్కడ ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపులను తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రజలు డిమాండ్ చేయాలి. ఆదివాసి ప్రజలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఈ కగార్ దాడికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలపై తప్పుడు కేసులు ఉపసంహరించుకునేలా హక్కుల సంఘాలకు పోరాడాలని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పోరాడుతున్న ప్రజలకు అండగా నిలుస్తూ తమ సంఘీభావ ఉద్యమాలు నిర్మించాల్సిందిగా కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి, మహిళా సంఘాలకు పిలుపునిస్తున్నాం. కగార్ దాడిలో భాగంగా ప్రజలపై అత్యంత క్రూరమైన దాడి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
→ మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో బస్తర్ లో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఖండించండి.

→→ మూడున్నర నెలల కాలంలో ప్రభుత్వ భద్రత బలగాలు, అర్థ సైనిక బలగాలతో 103 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వారిలో 60 మంది ఆదివాసి మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు.

→ బిజెపి ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా దేశాన్ని శాసిస్తూ కోర్టులను, జైళ్ళను, సి.బి, ఉపా(UAPA) లాంటి క్రూరమైన సంస్థలని, చట్టాలను తీసుకువచ్చి హక్కుల కోసం ఉద్యమించే ప్రజలను, విప్లవోద్యమ పోరాటాలను అణచివేస్తోంది.

→ గత ఏడాది కాలంగా చత్తీస్ఘడ్ అడవులు, ఆదివాసి ప్రజలపై గ్రామాలపై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తూ, అమాయకులపై రాజ్యం చేస్తున్న ఆధర్మయుద్ధం చరిత్రలో నిలిచిపోయేలా అడవుల్లో ఆకాశంనుంచి జనావాసాలను లక్ష్యంగా చేసుకొని బాంబుదాదులతో ఆదివాసీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు.

→ ఆదివాసి త్యాగాలతో రక్తసిక్తమవుతున్న అడవులలో ప్రభుత్వాలు రహదారులు వేస్తూ అడవులను ఖాకీమయం చేసి అపారమైన ప్రకృతి వనరులను తరలిస్తున్నాయి. అడవుల్లో ఆదివాసి హక్కులను హుళక్కి చేస్తూ కొత్త చట్టాలను రూపొందిచూస్తున్నాయి.

… దేశవ్యాప్తంగా పోరాడుతున్న ప్రజలకు అండగా నిలుస్తూ తమ సంఘీభావ ఉద్యమాలు నిర్మించాల్సిందిగా కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి, మహిళా సంఘాలకు పిలుపునిస్తున్నాం.

నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికై పోరాడుదాం అని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !