మణుగూరు తాహసిల్దార్ వినతి పత్రం అందజేత…
మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు.
నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి (మణుగూరు) మే 16:
బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంట పండించిన రైతులందరికీ 500 రూపాయలు బోనస్ తక్షణమే చెల్లించాలని తహసిల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన ధాన్యానికి ప్రతి కింటాకు 500 రూపాయలు బోనస్ యిస్తామని చెప్పి అధికారoలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిర్ణయాన్ని కేవలం సన్న వడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ అని సీఎం ప్రకటన రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.ఇప్పటి వరకు కొన్న వడ్లకి ఎక్కడ కూడ బోనస్ ఇచ్చిన దాఖలాలే లేవని అసలు దానికే దిక్కులేదు కోసరిది దేవుడు ఎరుగునని ఎద్దేవా చేశారు.ఇప్పుడు బోనస్ అనే మాయమాటలతో రైతులకు ఎగనామం పెట్టేటట్లు సీఎం ప్రకటన ఉన్నదని ఆరోపించారు. మొన్నటి వరకు రైతులకు రైతు బంధుకే దిక్కులేదని,ఇక బోనస్ సంగతి దేవుడెకే తెలియాలని , మోసపూరిత పథకాల, హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరిని మోసం చేస్తోందని మండిపడ్డారు.అసలు మన రాష్ట్రానికి గబ్బిలానికి గుడ్లగూబకు తేడా తెలియని ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసిందని,ఇలాంటి ముఖ్య మంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు.తక్షణమే రైతులు పండించిన అన్ని రకాల ధాన్యానికి ప్రతి కింటాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని లేనిపక్షంలో రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, డైరెక్టర్ ఉడతానేని రవి, మణుగూరు రైతు సమితి మాజీ అధ్యక్షులు వెంకట రెడ్డి,తొగ్గూడెం ఎంపీటీసీ కనితి బాబురావు, కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ,మండల నాయకులు ముద్దంగుల కృష్ణ,బొశెట్టి రవి ప్రసాద్,కoభంపాటి శ్రీను, కలబోయిన సుబ్రహ్మణ్యం, సందీప్,హర్ష తదితరులు పాల్గొన్నారు.